మే 17న నార్త్ కరోలినాలో ‘టాటా’మహిళా విభాగం ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు
TATA : ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (TATA of NC) మహిళా విభాగం ఆధ్వర్యంలో మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వినూత్నమైన కార్యక్రమాలను తల్లుల కోసం ఏర్పాటు చేశారు.
ప్రధాన ఆకర్షణలు..
ఈ వేడుకల్లో ప్రధానంగా ‘లైవ్ కుకింగ్ కాంపిటీషన్’ నిర్వహించనున్నారు. ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే ఈ పోటీలో పాల్గొనే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పరిమిత ఎంట్రీలు మాత్రమే ఉన్నందున ఆసక్తి గల వారు త్వరగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 17, ఆదివారం
- సమయం: మధ్యాహ్నం 12:30 PM నుండి 4:00 PM వరకు
- విశేషాలు: లంచ్, ఫన్ గేమ్స్, క్రియేటివ్ యాక్టివిటీస్ , ఉత్తేజకరమైన బహుమతులు.
ఈ వేడుకలు కేవలం ‘టాటా’ సభ్యులకు మాత్రమే ఉద్దేశించినవి. సభ్యత్వం లేని వారు వెబ్సైట్ ద్వారా కొత్త మెంబర్షిప్ తీసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం టాటా మహిళా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హేమ దాసరి (919-760-7435) గారిని సంప్రదించగలరు. టాటా ప్రెసిడెంట్ వినోద్ కుమార్ కట్రగుంట , కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
