పెద్ది తర్వాత చరణ్ కు ప్రశంసల జల్లు ఖాయమే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్దిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఎమోషనల్ డ్రామా కోసం రామ్ చరణ్ చేసిన మేకోవర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్‌లో చరణ్ పూర్తిగా అథ్లెట్‌లా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శారీరకంగా మారడం మాత్రమే కాకుండా, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెన్సిటీపై కూడా విపరీతంగా శ్రమించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. షూటింగ్ పూర్తైన తర్వాత రషెస్ చూసిన పలువురు సినీ ప్రముఖులు చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారని సమాచారం.
ప్రత్యేకంగా సినిమాలోని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందని టాక్ వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ కెరీర్‌కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఆయన కూడా పెద్ది పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కథలో ఉన్న ఎమోషన్‌తో పాటు స్పోర్ట్స్ డ్రామాకు అవసరమైన రియలిస్టిక్ టచ్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు చాలా బలంగా ప్రెజెంట్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా చరణ్‌కు మరో భారీ కమర్షియల్ హిట్ ఇవ్వొచ్చనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతోంది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న పెద్ది ట్రైలర్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru) భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్(A. R. Rahman) గీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తయినట్లు సమాచారం. రిలీజ్‌కు ముందే భారీ హైప్ సొంతం చేసుకున్న పెద్ది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
