మే 10న చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మదర్స్ డే’ వేడుకలు
CAA: చికాగో ఆంధ్ర అసోసియేషన్ (CAA) తన 10వ వార్షికోత్సవ వేడుకల (2016-2026) సందర్భాన్ని పురస్కరించుకుని, మే 10వ తేదీన ఘనంగా మదర్స్ డే (అమ్మల గంట) వేడుకలను నిర్వహించనుంది. నేపర్విల్లేలోని వోల్ఫ్ క్రాసింగ్ కమ్యూనిటీ పార్క్లో ఉదయం 8:00 నుండి 11:00 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ వివరాలు..
అన్ని తరాల వారిని అలరించేలా సంస్థ ఈ క్రింది ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది.
ఫన్ ఫ్యామిలీ వాక్: కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా నడిచే కార్యక్రమం.
ఫ్లవర్ మేకింగ్: అమ్మల కోసం ప్రత్యేకంగా పూల అలంకరణలు సిద్ధం చేయడం.
బేక్ & షేర్: అమ్మల కోసం ఇష్టమైన తినుబండారాలు లేదా కేకులు తయారు చేసి అందరితో పంచుకోవడం.
క్రీడలు & ఫిట్నెస్: పిల్లల కోసం ఫిట్నెస్ గేమ్స్, సౌమ్య బొజ్జ నేతృత్వంలో జుంబా (Zumba) సెషన్ , ప్రత్యేకంగా మహిళల కోసం క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు.
ప్లాంట్ సేల్: చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం నిధుల సేకరణలో భాగంగా ‘స్ప్రింగ్ ప్లాంట్ సేల్’ (మొక్కల విక్రయం) నిర్వహించనున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ వేడుకల్లో పాల్గొనే సభ్యులకు ప్రవేశం ఉచితం కాగా, సభ్యులు కాని వారు 5 డాలర్ల ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు https://bit.ly/CAAWalk2026 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అధ్యక్షురాలు తమిశ్ర కొంచాడ లేదా నరసింహారెడ్డి ఒగ్గులను సంప్రదించవచ్చునని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
