చిన్న వయసులోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు కన్నుమూత.. ఎందుకంటే?
హాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు మైఖెల్ పాట్రిక్(mikhael Patrick) కన్నుమూశారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్(Game of thrones) ద్వారా గుర్తింపు పొందిన ఈ ఐరిష్ నటుడు మోటార్ న్యూరాన్ వ్యాధి(MND)తో పోరాడుతూ ఉత్తర ఐర్లాండ్‌లోని ఆసుపత్రిలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన భార్య నయోమి షీహాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చివరి క్షణాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా కన్నుమూశారని ఆమె భావోద్వేగంగా తెలిపారు.
2023 ఫిబ్రవరిలో మైఖేల్‌కు మోటార్ న్యూరాన్ డిసీజ్ నిర్ధారణ అయింది. ఈ వ్యాధి నరాల వ్యవస్థను ప్రభావితం చేసి క్రమంగా కండరాల పనితీరును దెబ్బతీస్తుంది. చేతులు, కాళ్లు బలహీనపడటం, నడవలేకపోవడం, మాట్లాడటంలో ఇబ్బందులు, శ్వాసలో సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పూర్తి చికిత్స లేకపోవడం వల్ల ఈ వ్యాధితో బాధపడుతున్నవారు సాధారణంగా కొద్దికాలంలోనే ప్రాణాలు కోల్పోతారు. మైఖెల్ కూడా ధైర్యంగా పోరాడినా ఆరోగ్యం క్షీణించి చివరకు మృతి చెందారు.
మైఖెల్ పాట్రిక్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది ది బ్రోకెన్ మ్యాన్ ఎపిసోడ్‌లోని పాత్ర. చిన్న పాత్రైనా తన సహజ నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. టెలివిజన్, థియేటర్ రంగాల్లో ఆయన మంచి గుర్తింపు పొందారు. సహనటులు, అభిమానులపై ఆయన వ్యక్తిత్వం గాఢమైన ముద్ర వేసింది. వ్యాధితో పోరాటంలో చూపిన ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన మృతి హాలీవుడ్ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
