పెద్ది ఒక్క ఈవెంట్ కోసం అంత ఖర్చా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్ది(Peddi) రిలీజ్‌కు ముందే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అన్ని భాషల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ప్లాన్స్ ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చకు దారితీస్తున్నాయి. మే 23న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించనున్న పెద్ది మ్యూజికల్ నైట్(Peddi musical night) కోసం నిర్మాతలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు సినిమా ప్రమోషన్స్‌లో ఇప్పటివరకు చూడని స్థాయిలో ఈ ఈవెంట్‌ను డిజైన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఈ వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఈవెంట్ కోసం దాదాపు రూ.2.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారనే టాక్ టాలీవుడ్లో వైరల్ అవుతోంది. సాధారణంగా హైదరాబాద్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు స్పాన్సర్ల నుంచి భారీ మద్దతు లభిస్తుంటుంది. కానీ భోపాల్‌లో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ ఈవెంట్ కు ఎక్కువ భాగం ఖర్చును నిర్మాతలే భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే మొత్తంతో మరో భారీ సాంగ్ తెరకెక్కించే అవకాశం ఉన్నప్పటికీ, నిర్మాతలు మాత్రం దీన్ని లాంగ్ టర్మ్ మార్కెటింగ్ స్ట్రాటజీగా భావిస్తున్నారని సమాచారం.
ఇక ఈ మ్యూజికల్ నైట్‌కు ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్(AR Rahman) ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్తో పాటు సినిమాలోని పలు పాటలను స్టేజ్‌పై ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల పాన్ ఇండియా సినిమాల్లో నార్త్ మార్కెట్ ఎంత కీలకమో పుష్ప 2(Pushpa2) వంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. దీంతో పెద్ది టీమ్ కూడా ఉత్తరాదిలో బలమైన హైప్ క్రియేట్ చేయడానికి ముందుగానే దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సినిమా జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
