మే 16న TASC ఆధ్వర్యంలో యూత్ రాపిడ్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్
TASC: దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (TASC) తన 55వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ‘చెస్ క్లబ్’ (Chess Klub) సహకారంతో విద్యార్థుల కోసం “టాస్క్ 2026 యూత్ రాపిడ్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్”ను నిర్వహిస్తోంది. చిన్నప్పటి నుండే పిల్లల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు.
టోర్నమెంట్ వివరాలు..
- తేదీ: మే 16, 2026 (శనివారం)
- సమయం: ఉదయం 9:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM (PST) వరకు
- రిజిస్ట్రేషన్ గడువు: మే 15, 2026
విభాగాలు (Categories)..
కిండర్ గార్డెన్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులను మొత్తం ఐదు విభాగాలుగా విభజించారు..
- కిండర్ గార్డెన్
- ప్రైమరీ స్కూల్ (గ్రేడ్ 1-3)
- ఎలిమెంటరీ స్కూల్ (గ్రేడ్ 4-5)
- మిడిల్ స్కూల్ (గ్రేడ్ 6-8)
- హై స్కూల్ (గ్రేడ్ 9-12)
నిర్వాహక బృందం..
టాస్క్ ప్రెసిడెంట్ కొండల రావు వాయినేని, ప్రెసిడెంట్ ఎలక్ట్ వేణు రెడ్డి కట్కూరి, సెక్రటరీ శంకర్ సింగంశెట్టి, ట్రెజరర్ మహేష్ నూకల, ఇతర కార్యవర్గ సభ్యులు ఈ టోర్నమెంట్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ప్రతి విభాగంలో మొదటి ముగ్గురు విజేతలకు ఆకర్షణీయమైన ట్రోఫీలను అందజేయనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఇమేజ్‌లోని క్యూఆర్ కోడ్ (QR Code) లేదా https://online.chessklub.com/tasc లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వెంకట్ పెయ్యాల (310-427-0335) లేదా విష్ణు కాలవకురు (949-307-1150) గారిని సంప్రదించగలరు.
