టాలీవుడ్ పై ఫోకస్ చేసిన కార్తీ
తమిళ స్టార్ హీరో కార్తి(Karthi)కి తెలుగులో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతూ వస్తోంది. ముఖ్యంగా ఊపిరి(Ooripi) తర్వాత కార్తీ నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలనే ప్రయత్నాలు చేసినా, అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు మాత్రం కార్తీ టాలీవుడ్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వరుసగా తెలుగు డైరెక్టర్లతో చర్చలు జరుపుతూ, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో కార్తీ ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) నిర్మిస్తుండగా, ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Sreenu)తో కార్తీ ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.
మరోవైపు, కార్తీ వచ్చే ఏడాది హిట్4(HIT 4) కోసం డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహించనున్నాడు. హీరో నాని(Nani)కు చెందిన వాల్ పోస్టర్ సినిమాస్(Wall Poster Cinema) ఈ సినిమాను నిర్మించనుంది. అలాగే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(Vivek Athreya)తో కూడా కార్తీ ఓ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇలా వరుస తెలుగు సినిమాలతో కార్తీ టాలీవుడ్లో తన మార్కెట్‌ను మరింత బలపరచుకునే ప్రయత్నం చేస్తున్నాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
