ప్యూరీ స్థానంలో ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్… !
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రతీ విషయంలోనూ తనదైన పంధాలో ఆలోచిస్తారు.అది సరైనదా..? కాదా అన్నది అనవసరం. తాను అనుకున్నదాన్ని ముందుకు తీసుకెళ్లడమే థ్యేయంగా ప్రయత్నాలు సాగిస్తారు.అందులో భాగంగానే ఇరాన్ యుద్ధంలో ఆపరేషన్ ప్యూరీ తీసుకొచ్చారు. అది సరైన ఫలితాలు ఇచ్చిందా..? లేదా అన్నది పక్కన పెడితే.. తమ దేశంలో చట్టపరంగా సమస్యలు తీసుకువచ్చే ప్రమాదముందని గుర్తించిన ట్రంప్.. దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్యూరీ స్థానంలో స్లెడ్జ్ హ్యామర్ తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్ (Iran)పై మరోసారి దాడులకు దిగాల్సివస్తే.. కాంగ్రెస్ అనుమతి అవసరం రాకుండా చూసేందుకు అమెరికా (USA) సైన్యం కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పేరు మార్చి.. ‘ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్’గా దాడులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యకు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) అని ట్రంప్ యంత్రాంగం పేరు పెట్టింది. భీకర యుద్ధం అనంతరం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతోనే ఆపరేషన్ ముగిసిందని ఇటీవల ట్రంప్ (Donald Trump) సర్కారు కాంగ్రెస్‌కు తెలిపింది. మరోవైపు.. యుద్ధం ముగింపు ప్రతిపాదనల విషయంలో ఇరుదేశాల మధ్య తిరస్కరణల పరంపర కొనసాగుతోంది. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే మాత్రం మరోసారి దాడులకు దిగుతామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో చర్చలు విఫలమై ట్రంప్ మళ్లీ యుద్ధం చేపడితే.. అది మరింత తీవ్రంగా ఉంటుందన్న అర్థం వచ్చేలా దానికి ‘ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్’ (Operation Sledgehammer)గా పేరు పెట్టాలని అమెరికా సైన్యం యోచిస్తోంది. దీంతోపాటు మరికొన్ని పేర్లను కూడా అది పరిశీలిస్తుంది. ఈ పేరు మార్పుతో కొత్త ఆపరేషన్‌కు కాంగ్రెస్ అనుమతి కోసం ట్రంప్ కార్యవర్గానికి మరో 60 రోజుల సమయం పడుతుంది.
అమెరికా నిబంధనల ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అక్కడి కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుంది. సాధారణంగా శత్రు భూభాగంలో సైనిక చర్యలు ప్రారంభించిన 48 గంటల్లోపు అధ్యక్షుడు కాంగ్రెస్‌కు తెలియజేయాలి. అక్కడినుంచి 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
