లీలమ్మకు తెలుగులో తగ్గిన జోరు
టాలీవుడ్లో ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్లిన యంగ్ హీరోయిన్(Sreeleela) ప్రస్తుతం కెరీర్లో కీలక దశను ఎదుర్కొంటోంది. పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ, తన అందం, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి చేరుకుంది. అయితే వేగంగా వచ్చిన అవకాశాలను వరుసగా ఒప్పుకోవడం, తగిన స్క్రిప్ట్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా విరామం లేకుండా సినిమాలు, ప్రమోషన్లతో బిజీగా గడిపిన శ్రీలీలకు ఇటీవల ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు.
కొన్ని సినిమాలు వాణిజ్యపరంగా మంచి ఫలితాలు సాధించినప్పటికీ, నటిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత దర్శక నిర్మాతలు కొత్త హీరోయిన్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో లీలమ్మ తన రెమ్యూనరేషన్‌ను పెంచడం కూడా కొంతమంది నిర్మాతలకు భారంగా మారిందని సమాచారం. రీసెంట్ గా రిలీజైన ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, అందులో ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన నటించినప్పటికీ, ఆ సినిమా ద్వారా శ్రీలీలకు పెద్దగా ప్రయోజనం కలగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే తెలుగు సినిమాలకు కొంత దూరంగా ఉన్న శ్రీలీల, ప్రస్తుతం తమిళంలో ధనుష్(Dhanush) సరసన ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తుండగా, హిందీలో కూడా రెండు సినిమాలతో బిజీగా ఉంది. అయితే టాలీవుడ్లో మరో భారీ అవకాశంతో తిరిగి బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ఆమె ఎదురుచూస్తోంది. సరైన కథ, బలమైన పాత్ర దొరికితే శ్రీలీల మళ్లీ తన స్థాయిని నిరూపించగలదనే నమ్మకం అభిమానుల్లో ఇంకా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
