విశ్వంభర ఈసారైనా వచ్చేనా?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర(vishwambhara)పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. డైరెక్టర్ వశిష్ఠ(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదట జూలై విడుదలకు సిద్ధమవుతుందని ప్రచారం జరిగినా, విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం కావడంతో విడుదల తేదీ వాయిదా పడింది. ముఖ్యంగా గ్రాఫిక్స్‌కు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న చిత్రబృందం, ప్రతి ఫ్రేమ్‌ను అత్యంత నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కారణంగా సినిమా విడుదల విషయంలో మేకర్స్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఇక గత రెండు రోజులుగా విశ్వంభర రెండు భాగాలుగా విడుదల కానుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాలపై డైరెక్టర్ వశిష్ఠ స్వయంగా స్పందించి అవన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. సినిమా ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు డిజిటల్ హక్కుల ఒప్పందం కూడా కీలక దశలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం విశ్వంభరను ఆగస్టు 15న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు ప్రస్తుతం పెద్ద సినిమాలు లేని నేపథ్యంలో, ఈ డేట్ సినిమాకు భారీ ప్లస్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యువి క్రియేషన్స్(UV Creations) నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్గా నటిస్తుండగా, కీరవాణి(Keeravani) సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను హరి గౌరా(hari gowra) పూర్తి చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
