మరోసారి బన్నీ సరసన పూజా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాకా షూటింగ్‌కు సిద్ధమవుతున్న బన్నీ, తదుపరి సినిమాగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నట్లు అనౌన్స్మెంట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా, మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.
ఇప్పటికే బన్నీ- పూజా హెగ్డే జంటకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన దువ్వాడ జగన్నాథం(Duvvada Jagannadham) మరియు అల వైకుంఠపురములో(Ala Vaikunthapurramuloo) సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా అల వైకుంఠపురములో తర్వాత ఈ జంటకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు మూడోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ స్టైల్లో తెరకెక్కే ఈ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉండనున్నట్లు టాక్.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉండగా, నటీనటులు మరియు టెక్నికల్ టీమ్ ఎంపికపై లోకేష్ కనగరాజ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించనుంది. రాకా షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నెక్ట్స్ ఇయర్ రిలీజ్ టార్గెట్ గా ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి
