బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు.. ఆయన ప్రస్థానమిదీ
బీజేపీ శాసనసభా పక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కలాకత్తాలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. సీఎంగా సువేందు పేరును బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా సువేందును తమ నేతగా ఎన్నుకున్నారు.శనివారం రోజున ఉదయం 11 గంటలకు బ్రిగేర్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
సువేందు అధికారి 1970 డిసెంబర్ 15 న తూర్పు మేదినీపూర్ లోని కర్కులీలో జన్మించారు. ఎంఏ చదివారు. ఆయనది రాజకీయ నేపథ్య కుటుంబమే ఆయన తండ్రి శిశిర్ అధికారి యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా వున్నారు. సువేందు 1995 లో తొలిసారి కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా గెలిచారు. 1998 లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. సువేందు 2006-09 మధ్య రాజకీయాల్లో బాగా ఎదిగారు. 2006 లో తొలిసారి కొంటాయీ నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇవి కూడా చదవండి
నందిగ్రామ్ ఉద్యమమే మలిచింది…
సువేందు రాజకీయ జీవితంలో 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమానిదే అగ్రస్థానం. నందిగ్రామ్ లో 10 వేల ఎకరాలు సమీకరించి, సెజ్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి వామపక్ష ప్రభుత్వం భావించింది. దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఆ ఉద్యమానికి మమతా బెనర్జీ నడిపించారు. మమతా బెనర్జీకి అన్నీ తానై వ్యవహరించింది కూడా సువేందుయే.
ఉద్యమం విజయవంతం కావడంతో మేదినీపూర్, పురూలియా, బాంకురా జిల్లాలకు టీఎంసీ ఇంచార్జిగా నియమించారు. టీఎంసీలో రెండో స్థాయి అగ్రనేతగా ఎదిగారు. 2009 లో తమ్లుక్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2016 లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి, మమత సర్కారులో మంత్రి అయ్యారు.
దాని తర్వాత 2017 లో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో తృణమూల్ వీడి, బీజేపీలో చేరిపోయారు. దీంతో తృణమూల్ కి దెబ్బ తగిలినట్లైంది.2026 ఎన్నికల్లో కూడా సుబేందు నందిగ్రామ్ తో పాటు మమత బరిలో దిగిన భవానీ పూర్ నుంచి కూడా బరిలోకి నిలిచారు. తూర్పు మేదినీపూర్, నందిగ్రామ్ లో సువేందు కుటుంబానికి బలమైన పట్టు వుంది. మమతా బెనర్జీ తరహాలోనే ఆయన పోరాట పంథాను కొనసాగించారు. చొరబాట్లను వ్యతిరేకించారు.టీఎంసీ ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగట్టారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహంతో పాటు సువేందు పోస్టర్ బాయ్ గా కూడా బాగా కలిసొచ్చారు. దీంతో బీజేపీ అధికారం సాధించింది.
ఇవి కూడా చదవండి
