సీఐఐ బిసినెస్ సుమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
* సీఐఐతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. పెట్టుబడుల గురించి సీఐఐతో కలిసి పనిచేశాను
* దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నా అజెండా.
* నాలెడ్జీ, టెక్నాలజీ, ట్రస్ట్, స్పీడ్ అనే అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా పోటీ ఉంది
* పరిశ్రమల ఎకోసిస్టమ్, పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఐఐ చాలా కృషి చేసింది
* 1990లో వచ్చిన సంస్కరణలను అందిపుచ్చుకుని మనం అంతా కలిసి ముందుకు వెళ్లాం
* క్వాంటం, ఏఐ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఇంటెలిజెంట్ లాజిస్టిక్స్ రంగాలను అందిపుచ్చుకునేలా మనం పనిచేస్తున్నాం
* వేర్వేరు రంగాల్లో గ్లోబల్ ట్యాలెంట్ కూడా మనకు ఉంది. దేశానికి సరైన చోట సరైన నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు
* ఆర్ధిక సంస్కరణలు దేశానికి చాలా అవకాశాలు కల్పించాయి. చాలా ఆవిష్కరణలకు కారణం అయ్యాయి.
* టెలికామ్ డీరెగ్యులేషన్, ఓపెన్ స్కై పాలసీ, విద్యుత్ సంస్కరణలు, రహదారులు లాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి
* ఈ సంస్కరణల్లో నేను కూడా భాగస్వామిని కావటం సంతోషంగా ఉంది.
* ప్రస్తుతం దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వచ్చాయి
* గతంలో పశ్చిమ బెంగాల్ దేశానికే ఆదర్శంగా ఉండేది. కాని గత కొంతకాలంగా ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఆలోచనలే లేకుండా పోయాయి
* సంస్కరణల వాది అయిన ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుంది
* 8 అంశాలతో కూడిన నేషనల్ మిషన్ ను ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చారు.
* బంగారం కొనుగోలును వాయిదా వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు
* ఇంధనాన్ని పొదుపుగా వాడాలని, విద్యుత్ ఉత్పత్తిని కూడా సూచించారు
* ప్రతీ ఇల్లూ, పరిశ్రమ, పొలం అన్నీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావాలి.
ఇవి కూడా చదవండి

* ప్రజా రవాణాను వినియోగించాలని కూడా ప్రధాని స్పష్టంగా పేర్కోన్నారు.
* యుద్ధానంతర పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు మనం చూశాం
* వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న నినాదాన్ని కూడా ప్రధాని ఇచ్చారు. దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మనకు ఉన్నాయి
* గ్రేటర్ సెల్ఫ్ రిలయన్స్ అనే అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ప్రకృతి సేద్యం అన్నది ఓ కీలకమైన అంశంగా మారింది
* తద్వారా ఎరువుల దిగుమతి తగ్గుతుంది. మనం స్వయం సమృద్ధి సాధిస్తాం. ఈ జాతీయ టాస్క్ ను మనం అంతా కలిసి సాధించాలి
* ప్రతీ సవాలూ ఓ అవకాశాన్ని మనకు సృష్టిస్తుంది. భారత్ ఇక అన్ స్టాపబుల్ , దేశం ఓ గ్లోబల్ జెయింట్ గా మారుతుంది
* ఇంధనం సహా వివిధ రంగాల్లో భారత్ సుస్థిరాభివృద్ధి సాధించేలా ఈ అంశాలు తోడ్పడతాయని భావిస్తున్నాను
* గ్రీన్ ఎనర్జీ బయో గ్యాస్, ఇథనాల్, ఈవీ, వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు ఇప్పుడు మనకు కావాలి
* ఏపీ ప్రోజ్యూమర్ అనే విధానాన్ని ఇప్పటికే పాటిస్తోంది. సోలార్ రూఫ్ టాప్ ద్వారా దీనిని సాధిస్తున్నాం
* మైక్రో గ్రిడ్ వ్యవస్థ ద్వారా ట్రాన్స్ మిషన్ నష్టాలను కూడా ఎదుర్కునేలా మేం సిద్ధం అవుతున్నాం
* 20 లక్షల ఎకరాలు, 20 లక్షల రైతులు ప్రస్తుతం ఏపీలో ప్రకృతి సేద్యంలో ఉన్నారు.
* తద్వారా భూసారం పెంచటం సర్టిఫికేషన్, ట్రేసబిలిటీని సాధిస్తు్న్నాం
* భవిష్యత్ అవసరాల కోసం విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం కలిసి కృషి చేయాల్సి ఉంది
* పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులు అవసరం అవుతారు.
* విద్యారంగంలోని సంస్థలు నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేయాల్సి ఉంది.
* ప్రభుత్వాలు పెట్టుబడులు తీసుకువస్తాయి. ఈ మూడు కలిసి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి
* గ్లోబల్ టెక్ రంగంలో లీడర్ గా మారాలంటే అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది
* పట్టభద్రులను నిపుణులుగా మార్చుకోవడానికి నెలల సమయం వృధా చేస్తే జాతీయ మిషన్ ను ఉమ్మడిగా సాధించలేం
* ఎంప్లాయబిలిటి అనేది జాతీయ మిషన్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
* పరిశోధన, స్కిల్లింగ్, స్టార్టప్, మాన్యుఫాక్చరింగ్, గవర్నెన్స్, ఇన్నోవేషన్ లాంటి సమీకృత విధానాలపైనే దేశ అభివృద్ధి అధారపడి ఉంది
* 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ ఎకానమీగా తయారు కావాలని ప్రణాళికలు చేసుకున్నాం.
* భారత్ 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుతుందని ఆకాంక్షిస్తున్నాను.
* గడచిన 22 నెలల్లో మేం రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలను తీసుకురాగలిగాం
* భారత గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో 160 గిగావాట్లను ఏపీలోనే ఉత్పత్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నాం
* సంస్కరణల తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చింది, డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశాం
* డేటా సెంటర్ కోసం రిలయన్స్ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చాయి.
* రెన్యూ పవర్ కూడా ఇంగాట్ సోలార్ వేఫర్ ఉత్పత్తికి ముందుకు వచ్చింది.
* ఏపీలో మొదటిసారి మేం విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని కూడా 30 పైసల మేర తగ్గించాం.
* త్వరలోనే రూ.1.30 మేర విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే లక్ష్యంగా ఏపీ పనిచేస్తోంది.
* స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనే విధానాలతో మేం ముందుకు వెళ్తున్నాం
* టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ నగరంగా ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం
* నెట్ జీరో కాన్సెప్టుతో మేం పనిచేస్తున్నాం. అమరావతిలోనే క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కూడా వస్తోంది.