అన్నమయ్యపురంలో వీణార్చన చేసిన రమా, లలితా
పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం సాయంత్రం యథావిధిగా పారాయణ కార్యక్రమంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తదుపరి రమాదేవి కోమ్మరవోళ్ళు మరియు లలితా తిమ్మరాజు గార్లు కలిసి స్వామి వారికి భక్తిపూర్వక వీణల విందు చేసారు.
ఈ కార్యక్రమంలో “బ్రహ్మ కడిగిన పాదము, “అదిహొ అల్లదిహో శ్రీ హరి వాసము”, “శిరుత నువ్వుల వాడు”, “అదిమూలమే మాకు అంగరక్ష”, “తిరుమల గిరి రాయా”, “చూడమ్మ సతులాల” అనే అన్నమయ్య సంకీర్తనలకు వీణార్చన చేసి స్వామివారికి కైంకర్యాన్ని సమర్పించారు. వీరికి మృదంగ వాయిద్యం మల్లికార్జున సహాకారం అందించారు.
అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ గారు సంయుక్తంగా కళాకారులను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికను అందించి ప్రశంసించారు.
కార్యక్రమం చివరగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.
