పర్షియన్ గల్ఫ్ స్ట్రేట్ అథారిటీ ఏర్పాటు.. హర్మూజ్ పై ఇరాన్ నిబంధనలు..!
అమెరికా ఎంతగా బెదిరించినా.. ఎన్ని రకాలుగా చర్చించినా.. ఇరాన్ మాత్రం అనుకున్నంత చేసింది. హర్మూజ్ పై నౌకల రాకపోకల వ్యవహారాలు చూసేందుకు పర్షియన్ గల్ఫ్ స్ట్రేట్ అథారిటీ (PGSA)ని ఏర్పాటుచేసింది. ఇక్కడినుంచి పయనించే నౌకలు కచ్చితంగా 40 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందేనని ఇరాన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. సరకు వివరాలు, యాజమాన్యం, సిబ్బంది జాతీయత వంటి ప్రశ్నలు అడుగుతోంది. ఈ కొత్త నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. డ్రోన్, క్షిపణి దాడుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ నౌకలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమైన తర్వాత నుంచి హర్మూజ్‌కు కొత్త నిబంధనలు తీసుకొస్తామని ఇరాన్ (Iran) హెచ్చరిస్తోంది. అన్నట్టుగానే పీజీఎస్ఏ ఏర్పాటుచేయడాన్ని టెహ్రాన్ తీసుకున్న ప్రధాన చర్య అని విశ్లేషణలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ రవాణామార్గ నియమాల ఆధారంగా హర్మూజ్ జలసంధిలో రాకపోకలు నడిచేవి. ఇరాన్ నిబంధనల ప్రకారం.. నౌకలకు సంబంధించిన గుర్తింపు నంబర్లు, వాటి మునుపటి పేర్లు వంటి వివరాలను పీజీఎస్ఏకు మెయిల్ చేయాల్సిఉంది.
ఈ పర్యవేక్షణతో పాటు భారీగా టోల్ ఫీజ్‌ను విధించడం ప్రారంభించిందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. నౌకల సురక్షిత ప్రయాణానికి రూ.18 కోట్ల వరకు వసూలుచేస్తున్నట్లు తెలుస్తోంది. హర్మూజ్‌లో ఉద్రికత్తలు అంతర్జాతీయ ఇంధన సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు జలసంధి మీదుగా రోజుకు 120 నౌకలు వెళ్లేవి. మే నెలలో ఆ సంఖ్య 40కి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి
