అలా చేస్తే మాత్రం పర్షియన్ గల్ఫ్ మొత్తం .. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని దిగ్బందిస్తామని అమెరికా సెంక్రటల్ కమాండ్ చేసిన ప్రకటనపై ఇరాన్ (Iran) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడం సముద్రపు దొంగతనం తో సమానమని ఐఆర్ జీసీ (IRGC) పేర్కొంది. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతటా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. అమెరికా (America) తమ రేవులను దిగ్బంధిస్తే తాము గల్ఫ్ రేవులను మూసివేస్తామనింది భద్రత ఉంటే అందరికి ఉండాలి, లేకపోతే ఎవరికీ ఉండకూడదని ఐఆర్ జీసీ పేర్కొంది. హర్మూజ్ జలాల్లో భద్రతను పర్యవేక్షిస్తామని ఐఆర్ జీసీ పేర్కొంది. తమ ఓడరేవులకు ముప్పు కలిగితే ఈ ప్రాంతంలో ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని వెల్లడించింది. శత్రు దేశాల నౌకలను జలసంది గుండా వెళ్ళడానికి అనుమతింంచబోమని స్పష్టం చేసింది. ఇరాన్ అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హర్మూజ్ (Hormuz) లోకి ప్రవేశించే వీలు కల్పిస్తామంది. హర్మూజ్ పై నియంత్రణ కొనసాగించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
