హెచ్1బీ వీసా ఉంటే.. గ్రీన్ కార్డు రానట్లేనా..?
US వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్ తగలనుందా..? ట్రంప్ సర్కార్ తాజా ప్రయత్నాలు చూస్తుంటే కచ్చితంగా ఔననే సమాధానం వస్తోంది. హెచ్-1బీ వీసా నిబంధనలను సమూలంగా మారుస్తూ అమెరికా కార్మిక శాఖ (DOL) సిద్ధం చేసిన సరికొత్త ప్రతిపాదనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేవలం ఉద్యోగ నియామకాలే కాకుండా, అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందాలనుకునే వారి కలలను చిదిమేసేలా ఉన్నాయి ఈ ప్రతిపాదనలు.
ఈ ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైన అంశం ‘ద్వంద్వ ఉద్దేశం’ (Dual Intent) రద్దు. ఇప్పటివరకు హెచ్-1బీ వీసాపై అమెరికా వెళ్లిన వారు అక్కడ పనిచేస్తూనే శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం.. హెచ్-1బీ అనేది కేవలం ‘తాత్కాలిక అవసరాల’ కోసమేనని, దీనిని శాశ్వత నివాసానికి సోపానంగా వాడకూడదని ట్రంప్ సర్కారు స్పష్టం చేస్తోంది. అంటే, వీసా గడువు ముగియగానే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందే అనే నిబంధనను కఠినతరం చేయబోతున్నారు.
స్థానిక అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ‘బై అమెరికన్ – హైర్ అమెరికన్’ నినాదాన్ని ప్రభుత్వం మరింత తీవ్రతరం చేస్తోంది. విదేశీయులను తక్కువ జీతానికి నియమించుకుని అమెరికన్ల అవకాశాలను దెబ్బతీయకుండా ఉండటానికి, కనీస వేతనాన్ని ఏకంగా 30 శాతం పెంచాలని ప్రతిపాదించారు. ఏదైనా పోస్టుకు విదేశీయుడిని తీసుకోవడానికి ముందు, ఆ ఉద్యోగానికి తగిన అమెరికా అభ్యర్థి దొరకలేదని కంపెనీలు బలంగా నిరూపించుకోవాలి. లేదంటే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిస్తోంది.
ఇవి కూడా చదవండి
