పదిశాతం గ్లోబల్ టారిఫ్ రద్దు.. కోర్టులో ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ…!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు .. గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% గ్లోబల్ టారిఫ్స్ (ప్రపంచవ్యాప్త దిగుమతి సుంకాలు)ను అక్రమం అని ప్రకటించి రద్దు చేసింది. ఫిబ్రవరి 2026లో సుప్రీం కోర్టు ట్రంప్ మొదటి విస్తృత టారిఫ్ పాలసీని రద్దు చేసిన తర్వాత, ఆయన రెండవసారి సెక్షన్ 122 (Trade Act of 1974) కింద 10% గ్లోబల్ టారిఫ్ విధించారు. ఈ కొత్త టారిఫ్‌లను కూడా కోర్టు ఇప్పుడు అనధికారికం అని తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పు ముఖ్యాంశాలు:
1974 చట్టం కింద టారిఫ్‌లు విధించడానికి నిరంతర బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డెఫిసిట్ ఉండాలని, అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని కోర్టు పేర్కొంది.ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమంటూ చిన్న వ్యాపారులు, డెమొక్రాటిక్ రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులో భాగంగా రద్దు చేసింది కోర్టు.
టారిఫ్‌లు తాత్కాలికమైనవి (150 రోజులు) అయినప్పటికీ, కోర్టు వాటిని చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చింది.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ తీర్పును అప్పీల్ చేయనుందని సంకేతాలు వెలువడ్డాయి. ట్రంప్ ఇంతకుముందు సుప్రీం కోర్టు తీర్పును తీవ్రంగా విమర్శించి, వేరే చట్టం కింద కొత్త టారిఫ్‌లు విధించారు. ఫిబ్రవరి 2026లో సుప్రీం కోర్టు (6-3 తీర్పు) IEEPA (International Emergency Economic Powers Act) కింద ట్రంప్ విధించిన టారిఫ్‌లను రద్దు చేసింది. ఆ తర్వాత ట్రంప్ సెక్షన్ 122ని ఉపయోగించి 10% గ్లోబల్ టారిఫ్ విధించారు. ఈ రెండు తీర్పులూ ట్రంప్ “America First” వాణిజ్య విధానానికి పెద్ద సవాల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
