ఒబామా రాజకీయాల్లో కొనసాగాలని డెమొక్రాాట్లు ఎందుకు కోరుతున్నారు..?
అమెరికా విజయవంతమైన అధ్యక్షుల్లో బరాక్ ఒబామా ఒకరు.. తన పాలన కాలంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ.. వాటిని తనదైన శైలిలో పరిష్కరించుకుంటూ ముందుకెళ్లారు ఒబామా. అలాగే పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా మిగిలిన అధ్యక్షుల్లా రాజకీయాలకు దూరం కాలేదు ఒబామా . ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలపై .. వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వచ్చారు.
అసలు ఇంతకూ ఒబామా ఎందుకు రాజకీయాలకు దూరం కావడం లేదు. మిగిలిన అధ్యక్షుల్లా ఎందుకు సైలెంట్ గా తమ జీవితాన్ని గడపడం లేదు. దీనికి ప్రధాన కారణం సొంతపార్టీ డెమొక్రాట్లేనట. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఒబామానే.. ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ట్రంప్ అధికారంలో ఉన్నంత వరకూ తనను క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలని పార్టీ ఒత్తిడి తెస్తోందన్నారు ఒబామా.
అయితే ఇదే విషయంలో మిషెల్ మాత్రం వేరే రకంగా ఆలోచిస్తున్నారట. అధ్యక్షుడిగా దేశానికి సేవలందించారు. ఇక పూర్తిస్థాయిలో కుటుంబానికి అందుబాటులో ఉండాలని మిషెల్ కోరుతున్నట్లు తెలుస్తోంది.ఒకవైపు పార్టీ, మరొకవైపు భార్య మధ్య సతమతమవుతున్నారు ఒబామా. ‘‘శేష జీవితంలో భర్త మరింత సమయాన్ని తన కోసం కేటాయించాలని ఆమె కోరుకుంటున్నారు. ఇది మా సంసారంలో ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఆమె నిరాశకు గురవుతున్నారని ఒబామా తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షులు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఒబామా కూడా అలాగే ఉండేవారు. ఆయన పనితీరుపై ఎలాంటి వ్యాఖ్యలూ చేసేవారు కాదు. అయితే కాలం గడిచే కొద్దీ ట్రంప్ విధానాలపై మాజీ అధ్యక్షుడు విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. దేశ అధ్యక్ష పదవిని వదిలి 16 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా పార్టీ కోసం పనిచేస్తున్న అరుదైన డెమోక్రటిక్ పార్టీ నేతల్లో ఒబామా ఒకరు.
ఇవి కూడా చదవండి
