అమెరికా సాదారణ దేశంగా మారనుందా…?
అమెరికాను సుసంపన్నం చేసిందే హెచ్1బీ వీసా.. ఎందుకంటే ఈ వీసా ఆధారంగా చేసుకుని ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభావంతులు అమెరికా గడ్డపై అడుగుపెట్టి.. అక్కడే తమ భవిష్యత్తును నిర్మించుకున్నారు. అంతేకాదు.. దాంతో పాటు అమెరికా ఆర్థికవ్యవస్థను సైతం సుసంపన్నం చేశారు. అందుకే వారిని అమెరికా సైతం అంతేస్థాయిలో గౌరవించింది కూడా. కానీ ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో.. అప్పటి నుంచి వారిని వేరు చేసి మాట్లాడడం మొదలు పెట్టారు. వారిని దొంగలుగా, దోపిడీ దారులుగా చిత్రీకరించడం పెరిగిపోయింది.
సాక్షాత్తూ అధ్యక్షుడే .. ఎన్నారైలు ఇక్కడకు వచ్చి, తమ అవకాశాలను దోచేస్తున్నారని పదేపదే ప్రకటిస్తుండడంతో.. ఇక ప్రజలు ఊరుకుంటారా..? దీంతో ఇప్పుడు అమెరికాలో తమ కలల సౌధాన్ని నిర్మించుకున్న సగటు ఎన్నారై.. తాము దశాబ్దాల క్రితం చేసింది తప్పా అని అంతర్మథనంలో పడిపోయాడు. ఎందుకంటే అక్కడే ఆస్తులు కొన్నారు. అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు.. అక్కడే పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్లై అమెరికా సిటిజన్లుగా మారిపోయారు. ఇప్పుడు వారందరికి మీరు ఇక్కడి వాళ్లు కాదు.. వెళ్లిపోండని అల్టిమేటమిస్తే.. ఎలా ఉంటుంది. మనస్సు చివుక్కు మనదూ..
ఇవి కూడా చదవండి
దీంతో ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన ఎన్నారైల్లో 40 శాతం మంది తిరిగి వెళ్లిపోతే బాగుంటుందా అన్న ఆలోచనలో పడ్డారు. ఇది సాదారణ విషయం కాదు.. ఎందుకంటే.. ఓ స్థాయికి వెళ్లిన వ్యక్తి… దేశంకోసం జీవితాంతం కష్టపడిన కుటుంబాలు తిరిగి వెళ్లిపోదామని భావించాయంటే.. అది వారిని ఎంతగా మానసికంగా , శారీరకంగా ఇబ్బంది పెట్టాయో అర్థమవుతుంది. వీరు వెళ్లిన తర్వాత మళ్లీ ప్రతిభావంతులను రమ్మని అమెరికా ఆహ్వానించగలదా.. ఆహ్వానించినా వీటన్నింటిని చూసిన యువత.. మళ్లీ అటువైపు చూస్తుందా.. అంటే అమెరికా.. ఇక అమెరికన్లకే పరిమితం కానుంది.
దీనర్థం ఇక అమెరికా ప్రతిభావంతులకు ఆహ్వానం పలికే పరిస్థితి ఉండదు.. కేవలం వారు అమెరికన్లు అయితే చాలు అన్న సంకుచిత స్వభావాన్ని వంట పట్టించుకుంటోంది. దీంతో ఇక అక్కడ నూతన ఆవిష్కరణలు తగ్గిపోతాయి. కొత్త కంపెనీల రాక, పెట్టుబడులు నిలిచిపోతాయి. సాదారణ సగటు దేశంగా అమెరికా మారనుందన్న అంశం దీంతో అర్థమవుతోంది.
ఓవైపు ఇరాన్ యుద్ధంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ .. తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగాా ఆయుధాలకే లక్షల డాలర్లు ఖర్చుపెడుతోంది. వీటన్నింటికీ ఎవరి దగ్గర వసూలు చేస్తుంది. మళ్లీ సగటు అమెరికన్ దగ్గరే. ఓవైపు ఖర్చులు పెరుగుతున్నాయి. మరోవైపు..ఆర్థికాన్ని పరుగు పెట్టించే ప్రతిభావంతులు దేశం దాటిపోనున్నారు. ఇక అమెరికాకు మంచి రోజులు అన్నవి గతమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
