మీ బ్యాంక్ ఖాతా సేఫేనా? బ్యాంకులకు ఆర్బీఐ సీరియస్ డెడ్లైన్!
ప్రస్తుత డిజిటల్ యుగంలో జేబులో పర్సు లేకపోయినా బతికేస్తున్నాం కానీ.. స్మార్ట్ఫోన్లో యూపీఐ (UPI) యాప్ లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు అంతా ఆన్లైన్ లావాదేవీలే. అయితే మన డిజిటల్ పేమెంట్స్ ఎంత వేగంగా, సులభంగా జరుగుతున్నాయో.. సైబర్ నేరగాళ్లు కూడా అంతే వేగంగా, అత్యాధునికంగా తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల కష్టార్జితం బ్యాంక్ ఖాతాల్లో (Bank Safety) ఎంతవరకు సురక్షితం? అన్న భయం ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది. ఈ ఆందోళనలను అత్యంత సీరియస్గా తీసుకున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలోని అన్ని బ్యాంకులకు ఒక సంచలన ఆదేశం జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
నేరగాళ్ల చేతిలో ‘ఏఐ’ బ్రహ్మాస్త్రం
ఇప్పటివరకు మనం చూసిన సైబర్ నేరాలు ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) రూపంలో వస్తున్న ముప్పు మరో ఎత్తు. ఏఐ టెక్నాలజీ అనేది మానవాళికి ఎంత ఉపయోగపడుతుందో, సైబర్ క్రిమినల్స్ చేతిలో పడి అంతే వినాశకరంగా మారుతోందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో (Bank Safety) ఎక్కడైనా అతి చిన్న సాంకేతిక లోపాలు (Vulnerabilities) ఉంటే, ఈ అధునాతన ఏఐ టూల్స్ వాటిని రెప్పపాటులో పసిగట్టేస్తున్నాయి. ఆ చిన్న లొసుగుల ద్వారా బ్యాంకింగ్ సర్వర్లలోకి చొరబడి మొత్తం వ్యవస్థను హ్యాక్ చేసే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆర్బీఐ గుర్తించింది.
ఆర్బీఐ కఠిన ఆదేశాలు
ఈ ‘ఏఐ’ సైబర్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ నడుంబిగించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 27న బ్యాంకులకు ఒక కఠినమైన అడ్వైజరీ జారీ చేసింది. దేశంలోని బ్యాంకులన్నీ (Bank Safety) తమ ‘సైబర్ సెక్యూరిటీ’ వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నాయో తక్షణమే అంతర్గత సమీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఆధునిక హ్యాకర్లు దాడి చేస్తే తట్టుకునే సాంకేతికత తమ వద్ద ఉందా? లేదా? అని బేరీజు వేసుకుని.. కేవలం రెండు నెలల్లోగా (60 రోజుల్లో) దానిపై ఒక పూర్తి స్థాయి నివేదికను బ్యాంక్ బోర్డుల ముందు ఉంచాలని డెడ్లైన్ విధించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నిర్మలా సీతారామన్ మీటింగ్ తర్వాతే..
ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఉన్నతస్థాయి భేటీలో ప్రధానంగా బ్యాంకింగ్ రంగం (Bank Safety) ఎదుర్కొంటున్న డిజిటల్ భద్రతా సవాళ్లు, సైబర్ దాడులపైనే సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆర్బీఐ నుంచి ఈ కీలక ఆదేశాలు వెలువడటం గమనార్హం. ఆర్బీఐ తాజా ఆదేశాలతో బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయని, భవిష్యత్తులో రాబోయే ముప్పులను ఎదుర్కోవడానికి బ్యాంకులు తమ ఐటీ (IT) ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడంపై భారీగా నిధులు వెచ్చించక తప్పదని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
