పశ్చిమాసియా సంక్షోభాన్ని నివారిస్తామంటున్న రష్యా…!
ఇరాన్ తో చర్చలు విఫలం కావడంతో నావల్ బ్లాకేడ్(NAVAL BLOCKADE) అస్త్రాన్ని బయటకు తీశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వెనెజువెలాలో ఈ విధానం సక్సెస్ కావడంతో.. ఇదే అస్త్రంతో ఇరాన్ ను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారు. వెనెజువెలాలో ఇది సక్సెసైనా .. దీన్ని తాము అడ్డుకుని తీరతామంటోంది ఇరాన్. ఆదిశగా చర్యలు కూడా ప్రారంభించింది. అయితే సంక్షోభం మరింత ముదరకుండా రష్యా బరిలోకి దిగింది. నావల్ బ్లాకేడ్ సరికాదన్న రష్యా.. శాంతి స్థాపన కోసం.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు కలిగిన రష్యా, ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడానికి కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను రష్యాకు తరలించడం ద్వారా అగ్రరాజ్యంతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని క్రెమ్లిన్ సూచించింది. ‘ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పుతిన్… గతంలోనే అమెరికా ముందు ఉంచారు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడానికి రష్యా మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు చర్చలు విఫలమవ్వడంతో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఇరాన్ తన స్నేహపూర్వక దేశాలైన చైనా వంటి ప్రాంతాలకు మాత్రమే చమురు నౌకలను అనుమతిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ముందుకొస్తున్నా అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే ప్రపంచం భారీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
