భారీగా పడిపోయిన ఆయుధాలు.. పెంటగాన్ ఆందోళన..!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తోంది. అయితే అమెరికా అనుకున్న లక్ష్యాలను .. ఇప్పటికీ సాధించలేకపోయింది. దీనికి తోడు అమెరికా ఆయుధాగారంలో క్షిపణుల సంఖ్య తగ్గిపోతోంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. పేట్రియాట్, థాడ్ ఇంటర్‌సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి. తోమహాక్ క్షిపణి నిల్వలు కూడా 35 శాతం మేర ఆవిరయ్యాయి. ప్రిసిషన్ స్ట్రైక్ మిస్సైళ్ల నిల్వలో 45 శాతం కంటే ఎక్కువ వాడారు. ఈ స్థాయి వినియోగం అమెరికా సైనిక సన్నద్ధతలో లోపాలను ఎత్తి చూపుతోందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇంకా యుద్ధం కొనసాగితే .. పరిస్థితి ఏమిటన్నది పెంటగన్ అధికారులను వేధిస్తోంది. ఎందుకంటే.. ఉన్నఆయుధాలన్నింటినీ .. ఇరాన్ యుద్ధంలో వాడేస్తోంది అమెరికా. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే.. మరిన్ని ఆయుధాలు వాడాల్సి ఉంటుంది. మళ్లీ వాటిని సమకూర్చుకునేందుకు బిలియన్ డాలర్లు అవసరమవుతాయి. ఫలితంగా అది అమెరికా ప్రజలపై ట్యాక్స్ భారాన్ని పెంచే ప్రమాదం కనిపిస్తోంది.
మరోవైపు చూస్తే..స్వల్పవ్యవధిలో సైనిక కార్యకలాపాలకు ఈ నిల్వలతో ఢోకా లేనప్పటికీ.. మరే ప్రాంతంలో భారీ ఘర్షణలో పాల్గొనాల్సి వస్తే ఈ ఆయుధ నిల్వలపైనే ఆధారపడే పరిస్థితి లేదన్నారు.
అదే సమయంలో ఇరాన్ కీలక సైనిక సామర్థ్యాలను కలిగి ఉందని పెంటగాన్ నిఘా విభాగం అంచనావేసింది. ఇటీవల ఆపరేషన్ తర్వాత కూడా ప్రాంతీయ శక్తిగా మిగిలేఉందని పేర్కొంది. ఆ దేశ సైనిక సామర్థ్యాలను భారీగా దెబ్బతీశామని ట్రంప్ యంత్రాంగం చేస్తోన్న ప్రకటనలకు ఈ అంచనాలు భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ కంటే డొనాల్డ్ ట్రంప్‌నకే ఒప్పందం ఎక్కువ అవసరంగా కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
