అమెరికాను నమ్మలేం.. రెండోదశ చర్చలకు రాలేమన్న ఇరాన్..!
అమెరికాతో రెండో దశ చర్చలకు ఇరాన్ వ్యతిరేకంగా ఉంది. ముఖ్యంగా అమెరికా ద్వంద్వవైఖరి అవలంభిస్తోందని.. అలాంటి దేశాన్ని నమ్మలేమంటున్నారు ఇరాన్ ప్రతినిధుల. ఓవైపు చర్చలంటూనే.. మరోవైపు తమ నౌకలను నిర్భందిస్తోందని.. ఇలాంటి వాతావరణంలో చర్చలెలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు. ఓవేళ చర్చలు జరిపినా.. వాటిని అమెరికా పాటిస్తుందన్న నమ్మకమేంటని నిలదీస్తున్నారు ఇరాన్ ప్రతినిధులు.
ఏప్రిల్ 21, 2026న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో దశ శాంతి చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు ఫలప్రదమవుతాయనే నమ్మకం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీనికి అమెరికా పెడుతున్న “అసాధ్యమైన డిమాండ్లు” (Excessive Demands), మారుతున్న వారి వైఖరి మరియు ఇరాన్ నౌకాశ్రయాలపై కొనసాగుతున్న నౌకా దళ దిగ్బంధనం (Naval Blockade) కారణాలుగా చెబుతోంది.
ఇవి కూడా చదవండి
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కార్గో షిప్‌ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకోవడాన్ని ఇరాన్ “సాయుధ పైరసీ”గా అభివర్ణించింది. ఇది ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయి మండిపడ్డారు.
మరోవైపు… చర్చలకు సిద్ధమని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. ఇరాన్ తమ తన డిమాండ్లకు లొంగకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, చమురు ఉత్పత్తికేంద్రాలు, భవనాలు, రోడ్లు ఇతర మౌలిక వసతులను నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు ట్రంప్.
ముగియనున్న కాల్పుల విరమణ
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 22, 2026తో ముగియనుంది. చర్చలు జరగని పక్షంలో ఈ గడువు పొడిగింపుపై అనిశ్చితి నెలకొంది, దీనివల్ల మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
