రెండు వారాల పాటు కాల్పుల విరమణ : కీలక ప్రకటన చేసిన ట్రంప్
ఇరాన్, అమెరికా విషయంలో అత్యంత కీలక నిర్ణయం వెలువడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రెండు వారాల పాటు కాల్పుల విరమణను ప్రకటించారు. హర్మూజ్ జల సంధిని తెరిచేందుకు ఇరాన్ కు మరో రెండు వారాలు గడువు ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షరీఫ్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించారు. ‘‘పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తో తాను మాట్లాడానని, ఇరాన్ కు ఇచ్చిన గడువును రెండు వారాల పాటు పొడిగించాలని, దాడులు నిలిపేయాలని కోరినట్లు ట్రంప్ అందులో పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరించానని, ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ వుంటుందన్నారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనల్నీ సానుకూలంగానే వున్నాయని, దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయని ప్రకటించారు. ఇరాన్‌తో శాశ్వాత ఒప్పందానికి, పశ్చిమాసియాలో ప్రశాంతతను నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం త్వరలోనే దొరకబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
