మయన్మార్ లో భారీ రూబీ.. విలువెంతో తెలుసా..?
మయన్మార్‌లో భారీ కెంపు (Ruby) లభ్యమైంది. మండలే నగరంలోని మొగాక్ సమీపంలో 11వేల క్యారెట్ల (2.2కేజీలు) బరువున్న కెంపును గుర్తించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇలా లభ్యమవడం అరుదైన విషయమని అభివర్ణించారు.
మయన్మార్‌లోని మొగాక్ ప్రాంతానికి కెంపుల లోయ అని పేరు. ఇక్కడ 1990లో 496 క్యారెట్లు, 1996లో 21,450 క్యారెట్లు, 2022లో 2,789 క్యారెట్ల బరువున్న కెంపులు లభించాయి. 1996లో దొరికిన రూబీ కంటే ప్రస్తుతం లభ్యమైన దాని విలువ ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఆ విలువ ఎంత ఉండొచ్చనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు. 2015లో జరిగిన ఒక వేలంలో 25.59 క్యారెట్ల మయన్మార్ రూబీ 30.33 మిలియన్ల డాలర్లు(రూ.286 కోట్లు) పలకడం గమనార్హం.
మయన్మార్‌లోని మొగోక్ (Mogok) ప్రాంతాన్ని “కెంపుల లోయ” (Valley of Rubies) అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యుత్తమ నాణ్యత గల కెంపులలో (ముఖ్యంగా ‘పిజియన్ బ్లడ్’ రకం) 90% పైగా ఈ ప్రాంతం నుండే లభిస్తాయి.
ఇవి కూడా చదవండి
