Dhurandhar 2: బుక్‌మైషోలో ‘దురంధర్ 2’ ఆల్-టైమ్ రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్స్..!
దాదాపు దశాబ్ద కాలం తర్వాత బాలీవుడ్ సినిమా గురించి ఓ రేంజ్ లో క్రేజ్ కనపడుతోంది. ఆదిత్య దర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్(Ranveer Singh) నటించిన దురంధర్ సీక్వెల్ పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద పెను తుఫాను సృష్టిస్తోంది. బుక్‌మైషోలో (BookMyShow) ఈ సినిమా సృష్టించిన తాజా రికార్డులు చూస్తే.. నేటి బాలీవుడ్ మీడియా రిపోర్ట్ ల ప్రకారం.. ‘దురంధర్ 2‘ సినిమాకు బుక్‌మైషోలో ప్రతి గంటకు సగటున 1,20,000 టికెట్లు విక్రయించారు.
గతంలో ఏ ఇండియన్ సినిమాకు కూడా ఈ స్థాయిలో బుకింగ్స్ జరగలేదని బుక్‌మైషో ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో 10 మిలియన్ల ఇంట్రెస్ట్ రేటింగ్/లైక్స్ సాధించిన మొదటి సినిమాగా ‘దురంధర్ 2’ చరిత్ర సృష్టించింది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూశారో ఈ రికార్డులే చెప్తున్నాయి. బుక్‌మైషోలో జరుగుతున్న ఈ భారీ బుకింగ్స్ ప్రభావంతో, సినిమా విడుదలైన అతి తక్కువ కాలంలోనే 1200 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పుడు 1500 కోట్ల మార్కును అందుకునే దిశగా దూసుకుపోతోంది.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘హౌస్‌ఫుల్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్ టికెట్ల కోసం లక్షలాది మంది ఒకేసారి లాగిన్ అవ్వడంతో బుక్‌మైషో యాప్, వెబ్సైట్ కొంతసేపు క్రాష్ అయినట్లు తెలుస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా థియేటర్ల యజమానులు అదనపు షోలు, అర్ధరాత్రి షోలను కూడా యాడ్ చేసారు. ‘దురంధర్ 2’ కేవలం ఒక సినిమా కాదు, ఒక గ్లోబల్ ఫినామినన్గా మారింది. బుక్‌మైషోలో ఇది సెట్ చేసిన ఈ ‘ఆల్-టైమ్ రికార్డు’ను బద్దలు కొట్టడమే కాదు.. ఎవరికీ అందనంత రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయనుంది. ఇప్పటికే రిలీజ్ కు ముందు 200 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి
