ఉగాది తెలుగు వారి కొత్త సంవత్సరానికి ఆరంభం సూచించే ప్రత్యేకమైన పండుగ. సంప్రదాయాలు, విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రంతో ముడిపడి ఉన్న ఈ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.
ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు, 12 రాశుల ఆధారంగా మన జీవిత ఫలితాలను పంచాంగం వివరిస్తుంది.
ఈసారి ఉగాది తేదీపై చాలా మందికి సందేహం ఉంది. కానీ చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయానికి ఉండే రోజు పండుగ జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది.
2026లో పాడ్యమి మార్చి 19 ఉదయం 6:52కి ప్రారంభమై మార్చి 20 తెల్లవారుజామున ముగుస్తుంది. అందువల్ల ఈసారి ఉగాది పండుగను మార్చి 19న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
ఉగాది రోజున చేసే ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది. ఇందులోని ఆరు రుచులు మన జీవితంలో ఉండే ఆనందం, బాధ, ఆశ్చర్యం వంటి అనుభవాలను సూచిస్తాయి.
పండుగ రోజు దేవుడి పూజలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పచ్చడి తింటారు. సాయంత్రం పంచాంగ శ్రవణం విని కొత్త సంవత్సరానికి మంచి ఆశలతో ప్రారంభం చేస్తారు.