Dhurandhar: రిలీజ్ కు ముందే దురంధర్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్..!
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్‘ (Dhurandhar 2: The Revenge) చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద చారిత్రక రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే అధిగమించడం గమనార్హం. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రం, ఇప్పటికే రూ.120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను ముందస్తు టికెట్ అమ్మకాల ద్వారా సాధించింది. కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది.
ఇవి కూడా చదవండి
భారత్‌లో పెయిడ్ ప్రివ్యూల (Paid Previews) ద్వారానే ఈ చిత్రం సుమారు రూ.32.44 కోట్లు వసూలు చేసింది. దీనితో గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ పేరిట ఉన్న రూ.25 కోట్ల రికార్డును ఇది అధిగమించింది. ఉత్తర అమెరికాలో 5 మిలియన్ డాలర్ల మార్కును అడ్వాన్స్ బుకింగ్స్‌లో అధిగమించిన తొలి భారతీయ చిత్రంగా ధురంధర్ 2 నిలిచింది. గతంలో ఈ రికార్డు ఉన్న ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి 2’, ‘పఠాన్’ వంటి చిత్రాలను కూడా ఇది వెనక్కి నెట్టింది.
ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల నుండి రూ.200 కోట్ల మధ్య వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, గత ఏడాది డిసెంబర్లో విడుదలై రూ.1300 కోట్లు వసూలు చేసిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్. ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు క్రేజ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
