సింగిల్ ఛార్జ్‌తో 175 కి.మీ రేంజ్.. బడ్జెట్ ధరలో అందుబాటులోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో (EV Scooter) పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒకప్పుడు ఈవీలంటే కేవలం కొన్ని స్టార్టప్ కంపెనీల పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు రంగంలోకి దిగాక లెక్కలు పూర్తిగా మారిపోయాయి. తాజాగా ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ ‘టీవీఎస్ మోటార్ కంపెనీ’ (TVS Motor Company) తన బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (EV Scooter) ‘ఐక్యూబ్’ లైనప్‌లో సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా, కస్టమర్ల ‘రేంజ్’ టెన్షన్ పోగొట్టేలా భారీ బ్యాటరీతో ‘ఐక్యూబ్ ఎస్’ (iQube S) పేరుతో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది.
భారీ బ్యాటరీ.. ఇక రేంజ్ టెన్షన్ లేదు!
కొత్త ఐక్యూబ్ ఎస్ మోడల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అందులోని పవర్ ఫుల్ బ్యాటరీ గురించే. పాత మోడల్లో ఉన్న 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను పూర్తిగా పక్కనపెట్టిన కంపెనీ.. దాని స్థానంలో అత్యంత శక్తివంతమైన 4.7 kWh (కిలోవాట్ అవర్) భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చింది. దీనివల్ల కస్టమర్లకు రేంజ్ పరంగా బంపర్ ఆఫర్ దక్కింది. ఐడీసీ ప్రమాణాల ప్రకారం చూసుకుంటే, ఈ కొత్త వేరియంట్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 175 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణ దూరాన్ని (రేంజ్) ఇస్తుందని టీవీఎస్ (EV Scooter) సగర్వంగా ప్రకటించింది. అంటే రోజువారీ ఆఫీస్, ఇతర పనుల కోసం వాడేవారికి ఇక ఛార్జింగ్ కష్టాలు తప్పినట్లే.
ఇవి కూడా చదవండి
దూసుకెళ్లే పెర్ఫార్మెన్స్
రేంజ్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్ విషయంలోనూ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (EV Scooter) అదరగొడుతోంది. ట్రాఫిక్‌లో వేగంగా దూసుకుపోయేలా.. కేవలం 4.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అద్భుతమైన యాక్సిలరేషన్ దీని సొంతం. ఇక దీని గరిష్ట వేగం గంటకు 82 కిలోమీటర్లు దాకా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
భద్రతలోనూ రారాజే!
కొత్తతరం యువతను ఆకర్షించేందుకు టీవీఎస్ ఈ స్కూటర్లో (EV Scooter) టెక్ ఫీచర్లను కుమ్మేసింది. సరికొత్త డిజైన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే ‘టీఎఫ్టీ డిస్ప్లే’ను ఇందులో అందించారు. కాల్, మెసేజ్ నోటిఫికేషన్లు, నేవిగేషన్, మనం ఎలా డ్రైవ్ చేస్తున్నామనే ‘రైడ్ డేటా ట్రాకింగ్’ వంటి ఫీచర్లు డ్యాష్‌బోర్డ్ పైనే కనిపిస్తాయి. ఇక భద్రత విషయానికొస్తే.. ఇరుకైన ప్రదేశాల్లో సులభంగా వెనక్కి తీసేందుకు ‘రివర్స్ మోడ్’, ప్రమాదాల సమయంలో అప్రమత్తం చేసే ‘క్రాష్ అలర్ట్’, కిందపడినప్పుడు హెచ్చరించే ‘ఫాల్ అలర్ట్’, అలాగే స్కూటర్ దొంగతనానికి గురికాకుండా పటిష్టమైన ‘యాంటీ-థెఫ్ట్ సిస్టమ్’ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ధర ఎంతంటే?
ఇన్ని అద్భుతమైన ఫీచర్లు, అదనపు బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ సరికొత్త ‘టీవీఎస్ ఐక్యూబ్ ఎస్’ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 1.37 లక్షలుగా నిర్ణయించింది. మార్కెట్లో ఉన్న ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లతో (EV Scooter) పోలిస్తే మెరుగైన రేంజ్, విశ్వసనీయత కోరుకునే వారికి ఇది అత్యుత్తమ ఆప్షన్‌గా నిలుస్తుందని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి భారీ బ్యాటరీతో టీవీఎస్ వేసిన ఈ కొత్త ఎత్తుగడ.. ఈవీ మార్కెట్లో అమ్మకాల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
