మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమనే చాన్స్.. అసలు కారణం ఇదే!
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు భారతీయుల జేబులను దహించివేయనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. గడిచిన రెండేళ్లుగా ఇంధన ధరల (Petrol Rates) విషయంలో స్థిరత్వాన్ని చూసిన సామాన్యుడికి ఇప్పుడు భారీ షాక్ తగలనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మే 15వ తేదీ లోపు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
జరగబోయే వడ్డన ఎంతంటే?
లీటరు పెట్రోల్, డీజిల్‌పై కనీసం రూ. 4 నుంచి రూ. 5 వరకు భారం మోపేందుకు చమురు సంస్థలు సిద్ధం అవుతున్నాయి. అలాగే సామాన్యుల వంటింటి గ్యాస్ (LPG) సిలిండర్‌పై కూడా రూ. 40 నుంచి రూ. 50 వరకు వాత పడక తప్పదని తెలుస్తోంది. ఒకవేళ ఈ స్థాయిలో పెంపు (Petrol Rates) అమలైతే.. 2022 తర్వాత దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఇంధన ధరల మార్పు ఇదే కానుంది.
అమాంతం ఈ పెంపు ఎందుకు?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude oil) ధరలు ఆకాశాన్ని తాకడమే దీనికి ప్రధాన కారణం. మొన్నటివరకు బ్యారెల్ 70 డాలర్లు ఉన్న క్రూడ్ ఆయిల్ ధర, ఇప్పుడు ఏకంగా 126 డాలర్లకు ఎగబాకింది. ముఖ్యంగా గ్లోబల్ ఆయిల్ (Petrol Rates) సప్లైకి అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’లో ఉద్రిక్తతలు నెలకొనడం ఈ ధరల మంటకు ఆజ్యం పోస్తోంది.
ఇవి కూడా చదవండి
పీకల్లోతు నష్టాల్లో చమురు సంస్థలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధర విపరీతంగా పెరిగినా, దేశీయంగా రిటైల్ ధరలు పెంచకపోవడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఒక్కో లీటర్ పెట్రోల్‌పై (Petrol Rates) రూ. 14, డీజిల్‌పై ఏకంగా రూ. 18 చొప్పున ఆయా సంస్థలు నష్టపోతున్నాయి. మొత్తం మీద ఈ నష్టం నెలకు సుమారు రూ. 30,000 కోట్లుగా అంచనా. ఈ భారీ ఆర్థిక భారాన్ని మోస్తూ సంస్థలు మనుగడ సాగించడం అసాధ్యంగా మారడంతోనే ధరల సవరణ అనివార్యమైంది.
ఇప్పటిదాకా ఎలా కట్టడి చేశారు?
వాస్తవానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర ఇంధన ధరలు చాలా తక్కువే. హాంకాంగ్‌లో లీటర్ పెట్రోల్ (Petrol Rates) రూ. 295, సింగపూర్‌లో రూ. 240 పలుకుతుండగా.. భారత్‌లో సుమారు రూ. 110 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతులు చేసుకోవడం, దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడం, ఇథనాల్ బ్లెండింగ్ శాతాన్ని 20%కు పెంచడం, ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు రూ. 10 మేర తగ్గించడం వల్లే కేంద్రం ఇప్పటిదాకా ధరలను విజయవంతంగా కట్టడి చేయగలిగింది.
కానీ, ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినా.. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి.. తట్టుకునే స్థాయి దాటిపోతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు త్వరగా సద్దుమణగకపోతే వాహనదారులకు ఈ ధరల పోటు తప్పదు. ఇంధన ధరలు (Petrol Rates) పెరిగితే ఆ ప్రభావం నేరుగా రవాణా రంగంపై పడి, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు సైతం మండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
