Tesla: అక్కడ టెస్లా ఫ్యాక్టరీ అన్యాయమే : ట్రంప్

భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రణాళిక అన్యాయమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. సుంకాలతో మన నుంచి లబ్ధి పొందాలని చూస్తోంది. ఫలితంగా మస్క్ తన కార్ల (Cars)ను విక్రయించడం అసాధ్యం మారుతోంది. ఉదాహరణ ఇండియానే. ఇప్పుడు ఆయన (మస్క్) భారత్ (India) లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అది ఆయన వరకు మంచిదే కావొచ్చు. కానీ, అమెరికా పరంగా అన్యాయమైన నిర్ణయమే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మస్క్ పక్కనే ఉండగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.