US: మాకు కలను ఎందుకు అమ్మారు..? చట్టబద్ధంగా వచ్చిన మమ్మల్ని ఎందుకు వెళ్లమంటున్నారు..?
 
                                    అమెరికా ఉపాధ్యక్షుడికి భారతీయ సంతతి యువతి సూటి ప్రశ్న..?
వలసల అమెరికా కఠిన వైఖరి.. లక్షలాది కుటుంబాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా డాలర్ డ్రీమ్స్ నమ్ముకుంటూ అగ్రరాజ్యంలో స్థిరపడిన ఎన్నారై కుటుంబాలు, యువత.. ఇప్పుడు దిక్కుతోచని స్థితికి చేరింది. చట్టబద్దంగా వచ్చి, పన్నులు కడుతూ అమెరికా ఉన్నతికి దోహదపడుతున్న ఎన్నారై యువతకు.. ఇప్పుడు ఇక్కడ మీకు స్థానం లేదని అమెరికాప్రభుత్వం కఠినంగా చెబుతుండడం సమస్యకు ప్రధాన కారణమైంది. అందుకే ఇప్పుడా యువతే.. నేరుగా మీరు చేసింది సరికాదంటూ అమెరికా పాలక వర్గానికి చెబుతోంది. అంతేకాదు.. ఇెదెంతవరకూ సమంజసమంటూ ప్రశ్నిస్తోంది.
మిసిసిపి విశ్వవిద్యాలయంలోని Turning Point USA ఈవెంట్లో అమెరికా ఉపాధ్యక్షుడు JD Vanceకు వలసల గురించి ఓ భారతీయ నేపథ్యం కలిగిన విద్యార్థిని ప్రశ్నించింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పరిపాలన , మాస్ డిపార్టేషన్ పై ప్రశ్న సంధించింది. “మీరు ఇక్కడ ఎక్కువ మంది , వలసదారులని చెప్పినప్పుడు, ఆ సంఖ్యను మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? మీరు మాకు ఒక కలను అమ్మారు; మేము మా యౌవనాన్ని మరియు సంపత్తిని ఈ దేశంలో ఖర్చు చేసాము ..ఇంత జరిగాక.. మీరు వైస్ ప్రెసిడెంట్‌గా వెళ్లిపొమ్మని ఎలా చెబుతున్నారు..? చట్టబద్దంగా దేశానికి వచ్చిన వారి పట్ల ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించిందా యువతి.
యూఎస్ కు చట్టబద్ధంగా వచ్చినవారిని గౌరవిస్తూ, అమెరికా దిగువ స్థాయి వలసను తగ్గించాలి. “కానీ ఒక వ్యక్తి, 10 మంది లేదా 100 మంది చట్టబద్ధంగా వచ్చి అమెరికాకు అందించేందుకు సహకరించినందున, భవిష్యత్తులో మిలియన్లు..పది మిలియన్ లేదా వంద మిలియన్ మందిని స్వీకరించుకోవడానికి మేము అంగీకరించినట్టుగా అవుతుంది అనుకోవడం సరిపోదని” వాన్స్ చెప్పారు, అలాగే గత దశాబ్దాలలో యుఎస్‌కు పనిచేసినది ఇప్పుడు దేశానికి ఉపయోగపడదని చెప్పారు. “యుఎస్ ఉపరాష్ట్రపతిగా నా పని ప్రపంచం గురించి ఆలోచించడం కాదు.. కేవలం అమెరికా ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే అన్నారు
లక్షలాది భారతీయుల గుండెల్లో బడబాగ్నిలా రగులుతున్న ఆప్రశ్నను ఆమె సంధించేసరికి.. అక్కడ ఉన్న వారందరూ చప్పట్లతో తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అయితే ఆమె అడిగిన ప్రశ్నకు.. జేడీ వాన్స్ సమాధానం చాలా క్లియర్ గా మెసేజ్ పంపించిందని చెప్పొచ్చు. ఇక నుంచి ట్రంప్ పాలనలో వలసదారులవిషయంలో ఉక్కుపాదం మోపడం కొనసాగుతుందన్నది దీని సారాంశం.అయితే కొన్ని MAGA సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆమెను .. హిందూ H-1B ఆక్రమణదారుగా విమర్శించాయి.











 
                                                     
                                                        