Raghuram Rajan : అమెరికాతో వాణిజ్య చర్చల్లో జర జాగ్రత్త
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం అమెరికాతో జరుపుతున్న చర్చల్లో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ (Raghuram Rajan) హెచ్చరించారు. ఈయూ(EU) , జపాన్(Japan) దేశాల్లా తొందరపడి అమెరికాకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దని కోరారు. అలాగే ఈ ఒప్పందం ద్వారా అమెరికా మన ఎగుమతులపై విధించే సుంకాలు 10 నుంచి 20 శాతం మించకుండా చూసుకోవాలని కోరారు. లేకపోతే తూర్పు, దక్షిణాసియా దేశాల ఉత్పత్తులతో మన ఉత్పత్తులు పోటీపడడం కష్టమని రాజన్ స్పష్టం చేశారు. ఈయూ, జపాన్ దేశాలు అమెరికా (America) లో భారీ గా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చి 15 శాతం సుంకాలతో బయటపడ్డాయన్నారు. మన దేశం అలాంటి హామీలకు దూరంగా ఉండడమే మంచిదన్నారు. మన దేశం జీరో సుంకాలకు అమెరికాను ఒప్పిస్తే మరీ మంచిదన్నారు.







