Donald Trump : ట్రంప్ టారిఫ్‌లపై దీటుగా స్పందిస్తాం : ఈయూ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాలతో అనేక దేశాలు పునరాలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీటిపై యూరోపియన్ యూనియన్ కూడా తీవ్రంగా స్పందించింది. ట్రంప్ ప్రతిపాదించిన ప్రతీకార టారిఫ్(Tariff) లలో సమర్థించుకునే అంశాలేమీ కనిపించలేదని, వీటిపై త్వరలోనే దీటుగా స్పందిస్తామని తెలిపింది. ట్రంప్ విధానం తప్పుడు దిశలో వెళ్తోందని స్పష్టం చేసింది. దిగుమతులపై ప్రపంచంలో అతి తక్కువ సుంకాలను ఈయూ విధిస్తోంది. 70 శాతం దిగుమతులపై సుంకాలే లేవు. ఎగుమతులపై అమెరికా (America) సుంకాలను పెంచేందుకు ఎటువంటి సమర్థనీయ అంశాలు కనిపించడం లేదు. స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అడ్డంకిగా మారే ఈ చర్యలపై ఈయూ త్వరలోనే దీటుగా స్పందిస్తుంది అని ఈయూ కమిషన్ (EU Commission) ఓ ప్రకటనలో వెల్లడిరచింది. ట్రంప్ ప్రణాళికలు సరైన దిశలో వెళ్తున్నట్లు కనిపించడం లేదని, ఆర్థిక అనిశ్చితిని పెంచడంతోపాటు ప్రపంచ మార్కెట్ల సామర్థ్యాన్ని ఇవి దెబ్బతీస్తున్నాయని పేర్కొంది.