అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి
2016 నాటి హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. మాజీ అధ్యక్షుడు ఒకరు అరెస్ట్ కావడం అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి. హష్ మనీ కేసులో ట్రంప్‌పై మొత్తం 34 అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను మన్హటన్ కోర్టులో లొంగిపోయారు. ఆ వెంటనే ఆయనను అధీనంలోకి తీసుకున్న పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. 2006లో లేక్ తాహో హోటల్లో ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్నట్లు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ఇటీవల వెల్లడిరచి ప్రకంపనలు రేపారు. ట్రంప్, తాను ఒక కార్యక్రమంలో కలసుకున్నామని, ఆ తరువాత శృంగారంలో పాల్గొన్నామని తెలిపారు. ఆ తరువాత 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు ఈ విషయాన్ని ఆమె బయట పెట్టకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంలో మనహటన్ కోర్టులో ట్రంప్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. ట్రంప్ తన అడ్వకేట్ కోహెన్ ద్వారా 1.30 లక్షల డాలర్లు డేనియల్స్‌కు ఇచ్చినట్లు ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపించింది. కోహెన్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో లొంగిపోయారు. ట్రంప్‌ను సాంకేతికంగా అరెస్ట్ చేసినప్పటికీ ఆయన చేతికి బేడీలు వేయలేదు. ట్రంప్ అరెస్ట్ అయిన కొద్ది నిమిషాలోనే విడుదల చేశారు. ట్రంప్ కోర్టుకు హాజరు కావడానికి ముందు ఆయన అభిమానులు న్యూయార్క్, ట్రంప్ టవర్, మనహటన్ కోర్టు వద్ద ఆందోళన చేపట్టారు.






