Tejas Accident: దుబాయ్ ఎయిర్ షో నిర్వాహకులపై అమెరికన్ పైలట్ ఆగ్రహం
దుబాయ్ ఎయిర్ షో 2025 నిర్వాహకులపై యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) పైలట్ మేజర్ టేలర్ ‘ఫెమా’ హైస్టర్ మండిపడ్డారు. భారత వైమానిక దళానికి (IAF) చెందిన పైలట్ మరణించిన తర్వాత కూడా ఈవెంట్‌ను టేలర్ హైస్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తేజస్ విమాన ప్రమాదంలో (Tejas Accident) భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్ మరణించినప్పటికీ, ఫ్లయింగ్ డిస్ప్లేలను కొనసాగించాలని నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన విమర్శించారు.
ఎఫ్-16 వైపర్ డెమాన్‌స్ట్రేషన్ టీమ్ కమాండర్ అయిన టేలర్.. తన ఎమోషనల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో, “మరణించిన ఐఏఎఫ్ పైలట్‌కు, అతని సహచరులు, కుటుంబ సభ్యులకు గౌరవ సూచకంగా” తమ చివరి ప్రదర్శనను రద్దు చేసుకోవాలని తమ బృందం నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ప్రమాదం (Tejas Accident) తర్వాత షో నిలిచిపోతుందని భావించినా, అది జరగలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
“ఏం జరిగినా షో ఎప్పుడూ కొనసాగుతుందని అంటారు. అది నిజమే. కానీ మీరు వెళ్లిపోయిన తర్వాత కూడా ఎవరో ఆ మాట చెబుతారని గుర్తుంచుకోండి,” అని టేలర్ (@femahiester) తన పోస్ట్‌లో రాశారు. స్యాల్ మృతదేహాన్ని పూర్తి సైనిక గౌరవాలతో తమిళనాడులోని సూలూరు వైమానిక స్థావరానికి తీసుకొచ్చి, ఆపై హిమాచల్ ప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామానికి తరలించారు. కాంగ్రా జిల్లాలో జరిగిన అంత్యక్రియల్లో స్యాల్ భార్య, వింగ్ కమాండర్ అఫ్షాన్, వారి ఆరేళ్ల కుమార్తెను పట్టుకుని కన్నీటితో వీడ్కోలు పలికారు. స్యాల్ కజిన్ నిశాంత్ అంత్యక్రియలు నిర్వహించారు.






