ISRO: త్వరలో అమెరికా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో :నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చే నెలలో అమెరికాకు చెందిన సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుందని ఇస్రో చైర్మన్ డా.వి.నారాయణన్ (Dr. V. Narayanan) తెలిపారు. తార్నాకలోని ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఇరిసెట్) 68వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మన ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక లాంఛ్ వెహికిల్ మార్క్ 3 ద్వారా అమెరికా శాటిలైట్‌ను డిసెంబరులో అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాం. ఇది అమెరికా, భారత్‌ల సంయుక్త ప్రయోగం కాదు, భారత్ పూర్తిస్థాయిలో చేపట్టిన వాణిజ్య ప్రాజెక్టు అని పేర్కొన్నారు. సాంకేతికత పురోగతితో భవిష్యత్తులో అన్ని రైళ్లలో రియల్‌టైమ్ పర్యవేక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుతం సుమారు 10 వేల రైళ్లకు రియల్‌టైమ్ వ్యవస్థను అనుసంధానించారని తెలిపారు.






