BJP: బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే రభస మొదలైంది. పలు అంశాలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు (Corporators) సిద్ధమయ్యారు. కౌన్సిల్ హాల్లోకి బీఆర్ఎస్ (BRS) కార్పొరేటర్లు ఫ్లకార్డులతో వచ్చారు. కార్పొరేటర్ల వద్ద ఉన్న ఫ్లకార్డులను లాక్కునేందుకు మార్షల్ యత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో మార్షల్స్ సమావేశమందిరం నుంచి వెళ్లాలని ఎమ్మెల్యే తలసాని (MLA Talasani) సూచించారు. అంతుకు ముందు బీజేపీ(BJP) కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి సమావేశానికి హాజరయ్యారు.






