NRI :మహానందీశునికి ఎన్నారై మహిళ భారీ విరాళం
నంద్యాల జిల్లాలోని మహానంది (Mahanandi) పుణ్యక్షేత్రానికి ప్రవాస భారతీయురాలు భారీ విరాళాన్ని ప్రకటించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా రూ.10.50 కోట్లతో నందీశ్వర సదనం నిర్మిస్తున్నారు. ఇందులో రూ.1.25 కోట్లతో మొదటి అంతస్తును నిర్మించేందుకు హైదరాబాద్కు (Hyderabad) చెందిన ఎన్నారై సరోజ (NRI Saroja) ముందుకొచ్చారు. ఈ మేరకు అంగీకార పత్రాలను దేవస్థానం అధికారులకు అందజేశారు. ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈవో ఎర్రమల మధు, వేద పండితులు రవిశంకర అవధాని, హనుమంతరాయశర్మ పాల్గొన్నారు. దాత, ఆమె బంధువులను దేవస్థానం పండితులు, అధికారులు శేషవస్త్రాలతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు.






