Donald Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకొని, టారిఫ్‌లు తగ్గిస్తాం: ట్రంప్
భారతదేశంతో సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) కుదుర్చుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ డీల్ పూర్తయిన తర్వాత భారత్‌పై టారిఫ్‌లను తగ్గిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. భారత్‌కు కొత్త అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడారు. గతంలో ఉన్న ఒప్పందం కంటే ప్రస్తుత అగ్రిమెంట్ భిన్నంగా ఉంటుందని, ఇరు దేశాలకు న్యాయం జరిగేలా డీల్ చేసుకుంటామని ఆయన (Donald Trump) తెలిపారు.
“ప్రధాని మోడీతో మాకు మంచి స్నేహం ఉంది,” అని ట్రంప్ పేర్కొన్నారు. కొత్త రాయబారి పెర్గియో ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా గతంలో ఇండియాపై అధిక సుంకాలు విధించినట్లు అంగీకరించారు. అయితే ఇప్పుడు రష్యా చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా తగ్గించినందున, తాము కూడా ఇండియాపై టారిఫ్‌లను తగ్గిస్తామని ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు.







