Nabha Natesh: కారులో ఇస్మార్ట్ హీరోయిన్ అందాల సెగ
నన్ను దోచుకుందువటే(Nannu Dochukundhuvate) అనే సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నభా నటేష్(Nabha Natesh) ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) మూవీతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకుంది. అవి కాకుండా నభా పలు సినిమాల్లో నటించింది కానీ ఆ సినిమాలేవీ అమ్మడికి స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టలేదు. అయినా సరే అమ్మడు పట్టు వదలని విక్రమార్కుడిలా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన ఫోటోషూట్లను పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నభా రీసెంట్ ఫోటోషూట్ యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. ఈ ఫోటోల్లో అమ్మడు బ్లేజర్, గమ్ బూట్స్ వేసుకుని చాలా డిఫరెంట్ గా ఉంది. కొత్త మేకోవర్ తో కారులో డిఫరెంట్ గా కూర్చుని తన హాట్ ఎక్స్ప్రెషన్స్ తో ఫ్యాన్స్ కు ఊపిరాడనీయకుండా చేయగా, ఈ ఫోటోలను వారు నెట్టింట వైరల్ చేస్తున్నారు.






