MSG: వెంకీ గౌడగా అలరించనున్న విక్టరీ వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu). నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) ఓ కీలక పాత్ర చేస్తున్నారు. చిరూ, వెంకీ టాలీవుడ్ లో నాలుగు దశాబ్ధాలుగా సినిమాలు చేస్తున్నప్పటికీ వారిద్దరూ కలిసి ఇప్పటి వరకు స్క్రీన్ షేర్ చేసుకున్నది లేదు.
అలాంటి ఓ రేర్ కాంబినేషన్ ను అనిల్ ఫిక్స్ చేసి, మన శంకరవరప్రసాద్ గారు చేశాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా, రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో వెంకీ క్యారెక్టర్ గురించి మాట్లాడిన అనిల్ అందరికీ ఓ షాక్ ఇచ్చాడు. అనిల్ మాటలు విన్న తర్వాత అందరికీ వెంకీ క్యారెక్టర్ పై ఎగ్జైట్మెంట్ పెరిగింది.
ఈ మూవీలో వెంకటేష్, వెంకీ గౌడ అనే కన్నడిగుడి పాత్రలో కనిపించనున్నాడని, అతను కర్ణాటక నుంచి వస్తాడని చెప్పాడు. తెలుగులో స్టార్ హీరో అయిన వెంకీని కన్నడ వ్యక్తిగా చూపించి అనిల్ ఏం ప్లాన్ చేశాడోనని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఈ మూవీలో వెంకీ క్యారెక్టర్ సెకండాఫ్ లో వస్తుందని, సినిమాలో అతని పాత్ర అరగంట పాటూ ఉంటుందని యూనిట్ వర్గాలంటున్నాయి.






