Kesineni Chinni: పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు : ఎంపీ కేశినేని
రాజధాని విషయంలో జగన్ (Jagan) మాటలను ప్రజలు నమ్మరని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్న మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, మంగళగిరిని కలిసి మహానగరం నిర్మించేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అడుగులు వేస్తున్నారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అటకెక్కించింది జగన్ ప్రభుత్వమేనని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు. వైసీపీ పని అయిపోయింది. చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి ఆ పార్టీది. మరో 25 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది. దేశంలో ఎక్కడలేనివిధంగా సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను తగ్గించారు. అమరావతి, విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది అని అన్నారు.






