The Raja Saab: రాజా సాబ్ హైలైట్స్ ఇవే!
ప్రభాస్(prabhas) నుంచి సంవత్సరం తర్వాత వస్తున్న సినిమా ది రాజా సాబ్(The Raja Saab). మారుతి(maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్(niddhi agerwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi kumar) హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్(Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మించిన ఈ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే రాజా సాబ్ సినిమాలో హైలైట్స్ ఇవేనంటూ ఇండస్ట్రీలో బజ్ నెలకొంది. ఆల్రెడీ ఈ సినిమాపై మంచి అంచనాలుండగా, ఇప్పుడు ఈ మూవీ గురించి బయటికొస్తున్న విషయాలు సినిమాపై అంచనాల్ని మరింత పెంచుతున్నాయి మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉందని అంటున్నారు.
దాంతో పాటూ సినిమాలో ఎడారి ఫైట్, పెద్ద ప్రభాస్ యాక్టింగ్, మార్కెట్ దెయ్యాల సీక్వెన్స్, మొసలి నుంచి మాళవికను కాపాడే సీన్, సంజయ్ దత్ తో జరిగే ఫైట్ అన్నీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడంతో పాటూ ఈ ఎపిసోడ్స్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. అంతేకాదు, రాజా సాబ్ క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని కూడా చెప్తున్నారు.






