KTR: కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోంది
కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్‌గా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఉర్దూ వర్సిటీ (Urdu University) భూములకు సంబంధించి ప్రభుత్వ నోటీసుల నేపథ్యంలో నందినగర్‌లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం భూములు లాక్కోవడం ఇదే మొదటిసారి కాదు. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ (Jayashankar Agricultural University) నుంచి 100 ఎకరాలు తీసుకున్నారు. విద్యార్థులు పోరాడినా ఆందోళనను అణచివేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఇదే విధమైన భూదందా చేశారు. అక్కడ 400 ఎకరాలు తీసుకునేందుకు యత్నించారు. సుప్రీంకోర్టు సీజే సుమోటోగా తీసుకుని ఆదేశాలు ఇచ్చేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించోలేదు అని అన్నారు.






