Mother Dairy:మదర్ డెయిరీ నూతన చైర్మన్ గా ప్రభాకర్ రెడ్డి
నార్ముల్ మదర్ డెయిరీ (Mother Dairy) నూతన చైర్మన్ గా మందడి ప్రభాకర్‌రెడ్డి (Mandadi Prabhakar Reddy) ఎన్నికయ్యారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నార్ముల్ మదర్ డెయిరీకి ఇప్పటి వరకు చైర్మన్‌గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పాడి రైతుల పెండిరగ్ బిల్లులు అందజేసేందుకు ఓ డైరెక్టర్ ముందుకు రావడంతో, పాడి రైతుల సంక్షేమం కోసం తన పదవిని త్యాగం చేస్తూ రాజీనామా (Resignation) చేసినట్టు మధుసుదన్ రెడ్డి పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






