Sankranthi:వెన్నెల్లో గోదారిలో తెలుగు కళా సమితి సంక్రాంతి సంబరాలు
తెలుగు సంస్కృతిని, భాషను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రవాస భారతీయుల కోసం ప్రముఖ రేడియో ఛానల్ టోరీ (TORi) ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నేడు జనవరి 7వ తేదీన వెన్నెల్లో గోదారి కార్యక్రమంలో తెలుగు కళా సమితి (TFAS) నిర్వహించనున్న సంక్రాంతి పోటీల గురించి ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ కార్యక్రమం టోరీ రేడియోలో నేడు భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటల నుండి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ ప్రత్యేక షోలో తెలుగు కళా సమితికి చెందిన కీలక ప్రతినిధులు పాల్గొని రాబోయే సంక్రాంతి పోటీల వివరాలను పంచుకోనున్నారు.
పాల్గొనే ముఖ్య అతిథులు:
- వెంకట సత్య టాటా – టి.ఎఫ్.ఏ.ఎస్ సెక్రటరీ
- ప్రసాద్ వూటుకూరు – టి.ఎఫ్.ఏ.ఎస్ వైస్ ప్రెసిడెంట్
- అరుంధతి శకెల్లి – టి.ఎఫ్.ఏ.ఎస్ మెంబర్షిప్ చైర్
ఆర్జే ఉష వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో తెలుగు భాషా ఉన్నతికి చేపట్టే పోటీలు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే వివిధ అంశాలపై చర్చ జరగనుంది. ఆసక్తి గల శ్రోతలు టోరీ యాప్ ద్వారా లేదా చిత్రంలో పేర్కొన్న ఫోన్ నంబర్ల ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనవచ్చు.






