LATA: అమెరికాలో అంబరాన్నంటనున్న సంక్రాంతి సంబరాలు.. లాటా ఆధ్వర్యంలో కైట్స్ ఫెస్టివల్
లాస్ ఏంజిల్స్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ ప్రతిబింబించేలా లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ (LATA) ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా భారీ ఎత్తున ‘గాలిపటాల పండుగ’ (Kite Festival) నిర్వహిస్తోంది. “తెలుగు భాష – సమాజ సేవ – యువత భవిత” అనే నినాదంతో ముందుకు సాగుతున్న LATA, ప్రవాస తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వేడుకలు కాలిఫోర్నియాలోని వివిధ నగరాల్లో జనవరి 10 నుండి జనవరి 17 వరకు వరుసగా నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో గాలిపటాలను ఉచితంగా అందించడం ఈ పండుగ ప్రత్యేకత. అయితే గాలిపటాలు పరిమితంగా ఉన్నందున, ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమ వివరాలు, వేదికలు:
జనవరి 10 (శనివారం): ఇర్విన్ (Irvine): మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు బిల్ బార్బర్ మెమోరియల్ పార్క్ వద్ద జరుగుతుంది. వివరాలకు కృష్ణ (832-257-4469) లేదా శ్రీకాంత్ (949-742-1856)ను సంప్రదించవచ్చు.
సైప్రస్ (Cypress): మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ఓక్ నోల్ పార్క్ వద్ద నిర్వహించబడుతుంది. శ్రీకాంత్ (714-916-3393) లేదా వెంకీ (626-290-8834)ను సంప్రదించగలరు.
శాంటా క్లారిటా (Santa Clarita): మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు వెస్ట్ క్రీక్ పార్క్ వద్ద వేడుకలు ఉంటాయి. సంప్రదించాల్సిన నంబర్: నరేంద్ర (661-600-3746).
జనవరి 11 (ఆదివారం): ఈస్ట్వేల్ (Eastvale): మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ఆర్చిడ్ పార్క్ వద్ద జరుగుతుంది. వివరాలకు సునీల్ (612-594-9444)ను సంప్రదించండి.
టారెన్స్ (Torrance): మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు కొలంబియా పార్క్ వద్ద పండుగ నిర్వహిస్తారు. సంప్రదించాల్సిన వ్యక్తి: చందు (424-386-9924).
జనవరి 17 (శనివారం): ఆర్కాడియా (Arcadia): మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ఆర్కాడియా కౌంటీ పార్క్ వద్ద ఈ వేడుక ముగియనుంది. వివరాలకు పృథ్వీ (626-566-4918) లేదా రమాదేవి (626-353-0206)ను సంప్రదించవచ్చు.
రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం latausa.org/events.php వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని లేదా (310) 400-0370 నంబర్‌కు కాల్ చేయవచ్చని LATA ప్రతినిధులు కోరారు.






