NNNM: నారీ నారీ నడుమ మురారి రన్ టైమ్ ఎంతంటే?
శర్వానంద్(Sharwanand) హీరోగా వస్తున్న తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక రోజు ముందు జనవరి 14 నుంచే మేకర్స్ ఈ సినిమాకు ప్రీమియర్లను ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న కారణంగా మూవీ యూనిట్ దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ సినిమా సెన్సార్ ను పూర్తి చేశారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న నారీ నారీ నడుమ మురారి(nari nari naduma murari) సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ ను అందుకుంది. అంతేకాదు, సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎలాంటి కట్స్ ను వేయలేదు. సెన్సార్ పూర్తి చేసుకున్న నారీ నారీ నడుమ మురారి 145 నిమిషాల నిడివిని ఖరారు చేసుకుంది. మామూలుగా ఈ మధ్య సినిమాలన్నీ దాదాపు 3 గంటలకు దగ్గరగా ఉంటున్నాయి.
అలాంటి టైమ్ లో ఈ సినిమా 2 గంటల 25 నిమిషాల నిడివినే కలిగి ఉండటం మూవీకి కచ్ఛితంగా కలిసొచ్చే అంశమే. సామజవరగమన (Samajavaragamana) ఫేమ్ రామ్ అబ్బరాజు(ram abbaraju) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్(Sayuktha menon), సాక్షి వైద్య (Sakshi vaidhya) హీరోయిన్లుగా నటిస్తుండగా, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) ఇందులో ఓ చిన్న క్యామియో చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.






